ఫెథాయ్‌పై అప్రమత్తం

GodFather

Don Corleone
Administrator
Moderator
Member

Status

Posts

66

Likes

38

Rep

0

Bits

84

6

Years of Service

LEVEL 4
45 XP
ఫెథాయ్‌పై అప్రమత్తం 
విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధం 
amr-top1a.jpg


* ఈ తుపాను 16న పెను తుపానుగా రూపాంతరం చెంది గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 17వ తేదీ సాయంత్రానికి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. ఆ తర్వాత గాలుల ప్రభావం తగ్గనుంది.

* ఒకవేళ దిశ మార్చుకుంటే దక్షిణ కోస్తా వైపు అంటే మచిలీపట్నం నుంచి నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇండియన్‌ మెటరాలజికల్‌ శాఖ, ఇస్రో, నాసాలు ఈ తుపానుపై విడుదల చేస్తున్న బులిటెన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు ఒక అంచనా వేస్తున్నారు.



* ప్రస్తుతం సముద్రంలో రెండో ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.





ఈనాడు అమరావతి





పొంచి ఉన్న ప్రకృతి విపత్తును ఎదుర్కొని ప్రాణ నష్టం లేకుండా సమర్థంగా ఏర్పాట్లు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి తీరం దాటనుంది. దీనికి ఫెథాయ్‌ తుపానుగా నామకరణం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను మచిలీపట్నం కేంద్రానికి సుమారు 1100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒంగోలు నుంచి కాకినాడ మధ్య తీరందాటే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఏ ప్రాంతంలో తీరం దాటినా దాని ప్రభావం కృష్ణా జిల్లాపై ఉండే అవకాశం ఉంది. దీంతో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, సంయుక్త కలెక్టర్‌ విజయకృష్ణన్‌ దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. టెలీకాన్ఫరెన్సులు నిర్వహించి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫెథాయ్‌ తుపాను ప్రభావంతో వచ్చే భారీ వర్షాలకు నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు. తుపాను ప్రభావం ఏయే ప్రాంతాలపై ఉండవచ్చని అంచనా వేశారు. ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు పునరావాస శిబిరాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

amr-top1b.jpg
 
GodFather's SIGNATURE

58,738

Members

370,142

Threads

2,945,453

Posts
Newest Member
Back
Top